By : Oneindia Telugu Video Team
Published : January 23, 2021, 11:40
Duration : 02:10
02:10
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ
ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన తర్వాత అజింక్య రహానేకు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా మాజీ లెఫ్టామ్ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ కూడా రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ టీమ్‌కు విరాట్ కోహ్లీలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మన్ కావాలో తేల్చుకోవాలన్నాడు. టెస్టుల్లో రహానే.. వన్డేలు, టీ20లకు కోహ్లీ, రోహిత్‌లు కెప్టెన్సీలు చేపడితే బాగుంటుందన్నాడు. అయితే బీసీసీఐ సెలక్టర్లు ఈ ధైర్యం చేయలేరన్నాడు.