By: Oneindia Telugu Video Team
Published : November 27, 2017, 04:40

జూపల్లికి షాక్: అడ్డుకొన్న రేవంత్ వర్గీయులు

Subscribe to Oneindia Telugu

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోస్గి మండలం నాగసానిపల్లిలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అడ్డుకొన్నారు. సర్పంచ్ లేకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని వాగ్వావాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. రేవంత్ రెడ్డితో పాటు టిడిపిలో ఇంతకాలం పాటు కొనసాగిన కీలక నేతలను టిఆర్ఎస్ తమ వైపుకు తిప్పుకొంది.
మరో వైపు కాంగ్రెస పార్టీకి చెందిన నేతలను కూడ టిఆర్ఎస్‌లోకి ఆకర్షించేందుకు టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఉప ఎన్నికల్లోనైనా, 2019 ఎన్నికల్లోనైనా రాజకీయంగా కొడంగల్‌లో రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలపై టిఆర్ఎస్ దృష్టి కేంద్రీకరించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా