By: Oneindia Telugu Video Team
Published : January 02, 2017, 04:49

తిరుపతి - విశాఖ డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రారంభం

Subscribe to Oneindia Telugu

తిరుపతి-విశాఖపట్నం మధ్య సూపర్ ఫాస్ట్ డబుల్ డెక్కర్ ఏసి రైలును శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.1200 సీట్ల కెపాసిటీ గల డబుల్ డెక్కర్ ట్రైన్ వారానికి మూడు రోజులు పాటు తిరుపతి నుంచి, మరో మూడు రోజులు పాటు విశాఖ పట్నం నుంచి నడుపుతారు. ఈ డబుల్ డెక్కర్ ఏసి ట్రైన్ ప్రారంభంతో.. తిరుపతి-విజయవాడ- గుంటూరు-విశాఖపట్నం మధ్య రాకపోకలకు మరింత సౌకర్యవంతం కానుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏపీ ప్రయాణికులకు ఇది నిజంగా తీపివార్తే నని నాయకులు చెబుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా