• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 09, 2018, 12:03
    Duration : 16:25

    టుడే బిగ్ న్యూస్ బిగ్ బైట్

    1. న్యూఇయర్ రోజున మద్యం మత్తులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఆయన సోమవారం మధ్యాహ్నం సమయంలో గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం యాంకర్ ప్రదీప్ మాట్లాడారు. అరగంట పాటు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తాగి వాహనం నడపవద్దని తాను ప్రచారం చేస్తానని చెప్పారు. తాను ఎవరినీ తప్పుదోవ పట్టించలేదన్నారు. ఆ రోజు అలా జరిగిపోయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన సమయానికి కౌన్సెలింగ్‌కు వచ్చానని చెప్పారు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పారు.నేను తప్పు చేశానని, ఇక ముందు ఇలాంటి తప్పు చేయనని ప్రదీప్ చెప్పారు. నేను పట్టుబడటం ఇదే మొదటిసారి అని చెప్పారు. తాను ఇక్కడకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. తమలాంటి వారిని చూసి చాలామంది నేర్చుకుంటారని, కాబట్టి మేం ఇలాంటి తప్పులు చేయవద్దన్నారు. మీరు ఎన్నిసార్లు అక్కడ తిరిగి ఉంటారని విలేకరులు ప్రశ్నించగా.. అలా ఏమీ లేదన్నారు.
    2. నెల్లూరు జిల్లాలోని కోడూరుపాడులో శనివారం నాడు జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, బాలలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా తయారు చేసిన పాట పాడారు. ఇందులో అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న బాలలు కూడా ఉండటంతో చంద్రబాబు ముగ్ధులయ్యారు. కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారిపోయి చిన్నారులను కొన్ని ప్రశ్నలు వేశారు. చిన్నారులు తడుముకోకుండా టక్కున సమాధానం చెప్పారు
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా