By : Oneindia Telugu Video Team
Published : December 12, 2017, 10:45

ఈరోజు బంగారం మరియు పెట్రోల్ ధరలు మీకోసం !

1. ఒక్కటైన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో ఈ పెళ్లి జరిగింది. డిసెంబర్‌ 26న ముంబైలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు.
2. నవవధువు శైలజపై దాడిచేసి దారుణంగా హింసించిన కేసులో నిందితుడు రాజేశ్‌కు మంగళవారం లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. గత బుధవారం కోర్టు ఇందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
౩. తెలుగు సినీ హస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య.పై కుటుంబసభ్యులు, భార్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.అయితే విజయ్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
4. తెలంగాణ మాగాణంలో తెలుగు పండుగకు ముస్తాబవుతున్న వేళ ఓ తియ్యని కబురు అందింది. అమెరికాలో తెలుగుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగేనట.
5. : అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్ స్వ్కేర్ వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా