By : Oneindia Telugu Video Team
Published : December 21, 2017, 07:01

టుడే టాప్ ట్రెండింగ్ న్యూస్

1. సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో తీర్పు వెలువడగానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన టెలికం మాజీ మంత్రి ఎ రాజా భార్య, కూతురు కోర్టులోనే కంటతడి పెట్టారు. ఈ కేసులో రాజా నిర్దోషి అని పాటియాలా కోర్టు జడ్డి సింగిల్ లైన్ తీర్పు ఇచ్చారు.డీఎంకే అధినేత్రి కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళి కూడా భావోద్వేగంతో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
2. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలో ఓట్లు వెయ్యడానికి ప్రజలు అధిక సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఆర్ కే నగర్ లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వెయ్యడానికి మహిళలు పెద్ద ఎత్తున క్యూకట్టారు. ఓటరు గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే వారిని క్యూలైన్ లోకి పంపించారు.
3. ఇక ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోజా ఇంకా జగన్ అబిమానులు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
4. కోడి పందేలపై నిషేధం ఉంది. కోర్టులు వాటిని నిషేధించాయి. అయినా వాటి నిర్వహణకు ఉత్తరాంధ్రలో ఏర్పాట్లు పెద్ద యెత్తున జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పెద్ద యెత్తున కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గెలుపు పుంజులపై అప్పుడే బెట్టింగులు కూడా ప్రారంభమయ్యాయి. కొంత మంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఈ పందేల నిర్వహణలో ఉండడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి
5. పెందుర్తి మండలం శివారులో స్థానికుల్లో కొందరికి ఎస్సీలతో స్ధలం విషయంలో వివాదం మొదలైంది. ఇంతలో ఓ మహిళ పట్ల అధికారపార్టీ నేతలు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ ఎస్సీ మహిళను కొట్టి రోడ్డుపై పడేసారు. తర్వాత బట్టలూడదీసారు. దాంతో గొడవ మరింత పెద్దదైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా