By : Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 06:22

ఈరోజు టాప్ 5 న్యూస్

1.చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఆదేశించారు. ఈరోజు తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఆయన సమావేశమయ్యారు.

2.ఉప్పల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లో టీమిండియా దాటిగా ఆడుతోంది. తొలి ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌(2) ఔటైనా తర్వాత వచ్చిన ఛతేశ్వర పూజారాతో కలిసి మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ జట్టును నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో మురళీ విజయ్‌, పూజారా అర్థశతకాలు సాధించారు

3.ప్రతిరోజు ఏదోక ప్రాంతంలో తమ్ముళ్ల లీలలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఒక మహిళ ను వేధించిన కేసులో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత లోకేశ్వరరావు తనయుడి వికృత చేష్టలు బయటపడ్డాయి.

4.సేవింగ్స్‌ ఖాతాల నుంచి నగదు తీసుకోవడంపై ఉన్న ఆంక్షలను రెండు దశల్లో పూర్తిగా ఎత్తివేసేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ప్రస్తుతం వారానికి ఉన్న గరిష్ఠ వితడ్రాయల్‌ పరిమితిని రూ.24 వేల నుంచి మొదట రూ.50 వేలకు, ఆ తర్వాత పూర్తిగా ఎత్తివేసేందుకు నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది...

5. హార్వర్డ్‌ యూనివర్సిటీ సదస్సులో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం అమెరికా చేరుకున్నారు. గురువారం నుంచి 12 వరకు వివిధ సమావేశాల్లో పాల్గొంటారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా