By: Oneindia Telugu Video Team
Published : December 28, 2017, 10:50

టుడే టాప్ 10 న్యూస్

Subscribe to Oneindia Telugu

సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పొగడ్తలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వెనుకబడిన వర్గాలను ఆదుకునేలా ఆర్థిక విధానాలు ఉండాలని, సామాజిక భద్రత ఉండేలా ప్రభుత్వ పాలసీలుండాలని కోవింద్ సూచించారు.

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర నూతన సీఎంగా జైరామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. ఠాకూర్‌చే ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ ప్రమాణస్వీకారం చేయించారు. సిమ్లాలోని ప్రఖ్యాత రిడ్జ్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం ఉదయం అట్టహాసంగా జరిగింది. మనది కానిదాని కోసం ఆశపడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఘటన ఇందుకు మంచి ఉదాహరణ. ఓ వ్యాపారి రూ.510 కోసం కారు దిగితే.. రూ.10 లక్షల విలువైన వజ్రాలను కోల్పోవాల్సి వచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా