By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 03:51

ఆ హీరో, డైరెక్టర్, హీరోయిన్ అరెస్ట్ తప్పదు

Subscribe to Oneindia Telugu

డ్రగ్స్ దందాలో కూరుకుపోయి, డీలర్లకు, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేశారని సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో, ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్ ల అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో వీరు ముగ్గురి చుట్టూనే ఉచ్చు బిగిస్తోంది. మిగతా వారంతా కేవలం కస్టమర్లుగా మాత్రమే ఉన్నారని, వీరు మాత్రం ఎంతో మందికి తమ చేతుల మీదుగా డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ వర్గాలు గుర్తించాయి.డ్రగ్స్ కు అలవాటుపడి కస్టమర్లుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తున్న పోలీసులు, మరొకరికి మత్తుమందులు సరఫరా చేసిన వారిని మాత్రం వదిలేది లేదని చెబుతున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా