By : Oneindia Telugu Video Team
Published : January 02, 2018, 11:44

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : యాంకర్ ప్రదీప్‌కు శిక్ష తప్పదా ?

హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. పలువురిపై కేసు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. ఆదివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్కరోజే హైదరాబాదులో 55,540 వాహనాలను తనిఖీ చేశారు. 1683 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూఇయర్ పేరుతో పోలీసులకు పట్టుబడిన కార్లలో ఎక్కువగా ఖరీదైనవే ఉండటం గమనార్హం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిండా ఖరీదైన కార్లు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం తాగితే నిందితులకు జైలు శిక్ష పడ అవకాశముంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే పబ్బులు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎక్కువగా దొరికారు.ఇక జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన యాంకర్ ప్రదీప్‌కు శిక్ష పడే అవకాశాలున్నాయా? అనే చర్చ సాగుతోంది. రాత్రి మూడు గంటల సమయంలో అతిగా మద్యం సేవించి కారు నడుపుకుండూ వస్తుండగా పోలీసులు ఆపారు.బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కారును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా