By: Oneindia Telugu Video Team
Published : November 03, 2017, 03:56

కారుతో ఢీకొట్టడంతో ఆర్ఎస్ఐ మృతి, పట్టించుకోని జనం video

Subscribe to Oneindia Telugu

సికింద్రాబాద్ ఓల్డ్ కాప్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు ట్రాఫిక్ ఏఎస్సైని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేదు. రోడ్డుపై పడిఉన్న ఆయన్ను అటుగా వెళ్తున్న వారు కూడా చూసి సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ ఓల్డ్ కాప్రాలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ట్రాఫిక్ ఏఎస్సై లక్ష్మణ్‌ను ఒక కారు ఢీకొంది. దీంతో ఆయన కిందపడిపోయారు. అయితే... కారు ఆగకుండానే వెళ్లిపోయింది. ఆ తర్వాత అదే దారిలో వస్తున్న మరో కొంతమంది వాహనదారులు కూడా అలా చూస్తూ వెళ్లిపోయారే తప్ప కనీసం ఆగి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు.
అంతసేపు ఆయన అలా రోడ్డు మీదే పడి ఉన్న్నారు. అప్పటికే రక్తం బాగా పోవడం, బలమైన గాయాలు కావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏఎస్సై మృతిచెందాడు. కాగా... కారు ఢీకొట్టిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు కారును గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, లక్ష్మణ్ అవయవాలను కుటుంబసభ్యుల అనుమతితో దానం చేశారు. లక్ష్మణ్ మియాపూర్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన కారు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా