By: Oneindia Telugu Video Team
Published : December 28, 2017, 07:02

ట్రిపుల్ తలాక్ పై భిన్న అభిప్రాయాలు !

Subscribe to Oneindia Telugu

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2017ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై పలువురు బిన్న అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
కాగా ఈ బిల్లు మహిళల హక్కులకు సంబంధించినదని సంప్రదాయాలు, ఆచారాలు, మతాలకు సంబంధించినది కాదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

తక్షణ ట్రిపుల్ తలాక్ లేదా తలాక్ ఏ విధంగా అయినా నేరమని ఈ బిల్లు చెప్తోంది. బాధితురాలు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చునని, తనకు, తన మైనర్ పిల్లలకు పోషణ భత్యాన్ని ప్రకటించాలని కోరవచ్చునని చెప్తోంది. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తప్పని చెప్పినా.. ట్రిపుల్‌ తలాక్‌ ఇస్తున్నారు అని, సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా 100 ట్రిపుల్‌ తలాక్‌ కేసులు నమోదయ్యాయి అని ఆవేదన వ్యక్తంచేశారు .

ముమ్మారు తలాక్‌ బిల్లుకు తాము మద్దతిస్తామని, కాకపోతే దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్‌ పక్షనేత వెల్లడించారు. బిల్లుకు మద్దతిచ్చినందుకు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌.. ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక దీనిపై చేపట్టిన చర్చ సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, చట్టపరంగా కూడా పొందిక లేదని వ్యాఖ్యానించారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా