By: Oneindia Telugu Video Team
Published : January 03, 2018, 01:03

ట్రిపుల్ తలాక్‌కు తిప్పలే!

Subscribe to Oneindia Telugu


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు తిప్పలు తప్పేటట్టు లేదు. లోక్‌సభలో సంఖ్యా బలంతో సునాయాసంగా బిల్లును ఆమోదించుకున్న ఎన్డీయే ప్రభుత్వం... పెద్దల సభలో మాత్రం సందిగ్ధంలో పడింది. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించిన బీజేడీ, అన్నాడీఎంకే సైతం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులోని నిబంధనలను వ్యతిరేకిస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడింది కేంద్రం.ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు రాజ్యసభ చైర్మన్‌ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా మంగళవారమే సభ ముందుకు రావాల్సిన బిల్లు వాయిదా పడింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ బిల్లుకు చట్ట రూపం తేవాలని కేంద్రం పట్టుదలగా ఉంది.

ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి ప్రతిపాదించాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)తో సహా విపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే బిల్లును సెలక్ట్‌ కమిటీకి ప్రతిపాదించ కుండానే గట్టెక్కించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యం లో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు భవితవ్యం నేడు రాజ్యసభలో తేలనుంది.
ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ అవలంబించే వైఖరి కీలకంగా మారనుంది. గతంలోనూ కీలక బిల్లుల సమయంలో యూటర్న్‌ తీసుకుని బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్‌ పార్టీ... ఇప్పుడు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై ఏం చేస్తోందనేది ఉత్కంఠభరింతంగా మారింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా