By : Oneindia Telugu Video Team
Published : November 21, 2017, 01:21

వీడియో క్లిప్పింగ్స్ : మహిళల పట్ల అసభ్యంగా !

ఆయనో మంత్రి గారికి పీఆర్వో. కానీ ఆయనే మంత్రి అనుకునేంతలా చలామణి అవుతాడు. ఎంతటి వారైనా సరే తనకు అడ్డు వస్తే వాళ్లను బజారుకీడ్చాలని చూస్తాడు. జర్నలిస్టు కావడంతో.. అవసరమైతే సదరు వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాయించేందుకు కూడా వెనుకాడడు. దీంతో రోజురోజుకు నిర్మల్ జిల్లాలో అతని బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే.. ఆఖరికి మంత్రి జోగు రామన్నను సైతం అతను లెక్క చేయలేనంత వరకు వెళ్లింది.
తెలంగాణ ఎక్సైజ్‌ మంత్రి పద్మారావు గౌడ్‌ పీఆర్వో పీలి కృష్ణ ఆగడాలివి. మంత్రి పేరును అడ్డుపెట్టుకుని మహిళలతో అసభ్యంగా వ్యవహరించడం.. తన సొంత జిల్లా నిర్మల్ లో అరాచాకాలకు పాల్పడటం పీలి కృష్ణకు పరిపాటిగా మారిపోయింది. ధైర్యం చేసి ఎవరైనా కేసు పెట్టినా.. పై స్థాయి నుంచి పైరవీలు చేయించగలడు. తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టించి.. దినపత్రికలలో వారి గురించి తప్పుగా రాయించగల ఘనుడు.ఇంతకీ పీలి కృష్ణ వ్యవహారంలో జోగు రామన్న ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే.. నిర్మల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శితో తలెత్తిన వివాదమే ఇందుకు ప్రధాన కారణం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా