By : Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 03:56

యువతకు ఉద్యోగాలు: కవిత

అంతరించిపోతున్న మానవీయ విలువల ఉద్దరణే ధ్యేయంగా సమ సమాజ నిర్మాణానికి మార్గదర్శకులుగా విద్యార్ధులు నిలవాలని ఎంపీ కవిత సూచించారు. తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకై... నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని ఎంపీ కవిత సందర్శించారు. కంరీంనగర్ జిల్లా.. తెలంగాణా జాగృతి కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరంలో ఈ ఏడాది 480 మంది యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చినట్టు కవిత తెలిపారు. తెలంగాణా వ్యాప్తంగా నిరుద్యోగితను నివారించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపిన ఆమె... బంగారు తెలంగాణా సాధన జరిగే వరకూ విశ్రమించమన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా