• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 11, 2018, 02:32
    Duration : 02:44

    మళ్లీ రుణమాఫీ : టీఆర్ఎస్ ప్రధానాస్త్రం

    అధికార టీఆర్ఎస్ అధినాయకత్వంలో విశ్వాసం సడలుతోందా? మళ్లీ గెలుపుపై అప 'నమ్మకం' ఏర్పడిందా? రైతాంగం వ్యతిరేకిస్తున్నారన్న సందేహాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014 ఎన్నికల ప్రచార బరిలో రైతుకు ఒకేసారి రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. తెలంగాణకు రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని గుర్తు చేసి మరీ 'రుణ మాఫీ' పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి నాడు కేంద్రంలో ఆర్థిక మంత్రి పీ చిదంబరం కూడా మద్దతు పలికారు. ఈ రుణ మాఫీ పథకం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని తేల్చేశారు. కానీ తర్వాత కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షం 'టీడీపీ అధికారం చేపట్టాయి. రుణ మాఫీపై నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తదితరులు మెటికలు విరిచారు. ఇది అస్తవ్యస్థ ధోరణులకు దారి తీస్తుందన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతులెత్తేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువు దీరిన టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు ఎడతెగని మంతనాలు జరిపి నాలుగు విడుతల్లో రుణ మాఫీ చేస్తామని ప్రకటించాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా