By: Oneindia Telugu Video Team
Published : June 22, 2017, 12:57

కోహ్లీ కి అహంకారమా, అహంభావమా ?

Subscribe to Oneindia Telugu

గతేడాది వెస్టిండీస్‌ పర్యటనతో కోచ్‌గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైన సంగతి తెలిసిందే. అక్కడ టెస్టు సిరీస్‌లో భారత్‌ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్‌ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్‌ ఇదే. ఆ తర్వాత సొంతగడ్డపై భారత్‌ వరుసగా న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు కైవసం చేసుకుంది.ఇలా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడి ఏకంగా 12 టెస్టుల్లో విజయం సాధించింది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. కుంబ్లే హయాంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు చేరింది. కుంబ్లే చివరగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది.మరోవైపు కుంబ్లేని కోహ్లీ తిట్టడం వల్లే మనస్తాపం చెంది అర్ధంతరంగా కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా