By : Oneindia Telugu Video Team
Published : December 18, 2017, 02:39

షాకిచ్చే స్థాయికి కాంగ్రెస్.. ఆ ఇద్దరే ఆశలు నిలిపారు!


భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టగా తీసుకుని విస్తృత ప్రచారం చేశాయి. మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆరాటపడగా, ఎలాగైనా విజయఢంకా మోగించాలని కాంగ్రెస్ తీవ్ర పోరాటమే చేసింది. ఇందుకు సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలిచాయి. బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓబీసీ నేతలైన జిగ్నేశ్ మేవానీ, అల్పేష్ ఠాకూర్‌లను ఉపయోగించుకుంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున వారిద్దరూ గుజరాత్ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. వీరిద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన స్థానాల్లో మరిన్ని స్థానాలు చేరాయని చెప్పడం సందేహం లేదు.
గుజరాత్ రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన రాధాన్పూర్ నుంచి తొలిసారి పోటీ చేసిన అల్పేశ్ మేవానీ ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తనకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో స్థానిక కాంగ్రెస్ నేత లావింగ్జీ ఠాకూర్ బీజేపీలో చేరారు. ఈయనే అల్పేశ్‌కు ప్రత్యర్థి కావడం గమనార్హం.
ఎన్నికల ప్రచారంలో అల్పేశ్ ఠాకూర్.. ప్రధాని మోడీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం గమనార్హం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా