By : Oneindia Telugu Video Team
Published : December 06, 2017, 06:14

హైదరాబాదు మెట్రో రైలుతో ఉబర్

ఉబర్‌ క్యాబ్‌ సంస్థ హైదరాబాద్‌ మెట్రో రైలుతో జట్టు కట్టి హైదరాబాద్ నగరవాసులకు సేవలు అందిస్తుందని ని తెలంగాణ, ఏపీ ఉబర్‌ జనరల్‌ మేనేజర్‌ దీపక్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికులను ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్‌ నుంచి గమ్య స్థానాలకు చేర్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో ఓ కియోస్కను ఏర్పాటు చేశామని, త్వరలో మిగతా మెట్రో స్టేషన్‌లలోనూ ఏర్పాటు చేస్తామని అన్నారు.
మెట్రోలో ప్రయాణం చేసేందుకు వచ్చే ప్రయాణికులు సొంత కార్లు, ద్విచక్ర వాహనాలను వినియోగించుకోకుండా షేరింగ్‌ ద్వారా వారిని స్టేషన్‌ల నుంచి గమ్య స్థానాలకు చేర్చేలా క్యాబ్‌లను అందుబాటులో ఉంచుతామని దీపక్ రెడ్డి చెప్పారు.
తాము చేసే ఏర్పాటు వల్ల మెట్రో స్టేషన్‌ల వద్ద పార్కింగ్‌ సమస్య తగ్గుతుందని ఆయన చెప్పారు. హైదరాబాదు నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉబర్‌ క్యాబ్‌లు, ఉబర్‌ మోటో సేవలు అందుబాటులో ఉంటాయని దీపక్‌ రెడ్డి తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా