ఏపీ సచివాలయంలో ఉండవల్లి అరుణ్ కుమార్!

Published : July 17, 2018 11:05 AM (IST)
Undavalli arun Kumar To Meets CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. అయితే, ఆయన సీఎంఓ ఆహ్వానం మేరకే ఇక్కడికి రావడం గమనార్హం. అంతేగాక, ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కాగా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సచివాలయానికి రావడం ఇది రెండోసారి. మొదటిసారి నిర్మాణ సమయంలో సచివాలయాన్ని చూసేందుకు వచ్చారు.విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై గతంలో చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరు, కేంద్రంపై అవిశ్వాసం వంటి అంశాలపై చంద్రబాబు.. ఉండవల్లి సలహాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఉండవల్లి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ విభజన హామీలు, రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో తాజా భేటీ ఆసక్తికరంగా మారింది.చంద్రబాబుకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని, దీనిని ఉపయోగించుకోవాలని కూడా ఉండవల్లి చెప్పారు. మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబట్టాలని, విభజన చట్టం చెల్లుబాటు కాదని, ఇందుకు సంబంధించి ఎంపీలు పోరాటం చేయాలని, పార్లమెంటులో జరిగిన దారుణాలు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కూడా తెలుసునని మాజీ ఎంపీ అన్నారు.
Up Next
Recommended వీడియోలు
  • 15 minutes ago
    శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..
  • 2 hours ago
    ఇక్కడ పక్కా టీడీపీనే వస్తది..
  • 3 hours ago
    ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఏదో శక్తి ఉంది..
  • 4 hours ago
    బీజేపి గుప్పిట్లో విచారణ సంస్ధలు రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారన్న కవిత
  • 4 hours ago
    రాయి విసిరిన వాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు..! అసలు విసిరింది వీళ్ళేనా..?
  • 4 hours ago
    త్వరలో వర్షాలు..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా