By: Oneindia Telugu Video Team
Published : January 18, 2018, 12:26

దిమ్మతిరిగే నోట్ల కట్టలు..పోలీసులు అవాక్కు !

Subscribe to Oneindia Telugu


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దిమ్మతిరిగే పాత నోట్ల కరెన్సీ డంప్ బయటపడింది. రద్దయిన రూ.500, రూ. 1000 నోట్ల డంప్ అది. ఈ పాతనోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసేందుకు16 మంది కుట్ర చేసినట్లు బయటపడింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్‌కు చెందిన ఆనంద్ ఖత్రీ అనే బిల్డర్ పూర్వీకుల ఇంట్లో ఈ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకుకు, ఆదాయం పన్ను శాఖకు అందించారు. ఈ డంప్ వ్యవహారంలో హైదరాబాద్ లింక్ వెలుగు చూసింది.
ఖత్రీ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు ట్రంకు పెట్టెల నిండా, గోనె సంచుల్లో కక్కి ఉన్న పాత నోట్ల కట్టలనూ చూసి పోలీసులు నివ్వెరపోయారు. 80 మంది పోలీసులు 37 యంత్రాలతో నోట్లను లెక్కించారు. 12 గంటల పాటు లెక్కంచారు. దాదాపు 97 కోట్ల లెక్క తేలినట్లు సమాచారం.
హైదరాబాద్, కోల్‌కతా, వరణాసి నగరాలకు చెందిన పలువురు వ్యాపారులు, దళారులు కొద్ది రోజుల కిందట కాన్పూర్ చేరుకుని వేర్వేరు హోటల్లో బస చేసి పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ డీల్ వెనక సూత్రధారి ఆనంద్ ఖత్రీది.
పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే బాధ్యతను హైదరాబాదు, కోల్‌కతాలకు చెందిన కోటేశ్వర రావు, అలీ హుస్సేన్, రాజేశ్వరిర రంగారావు, మనీష్ అగర్వాల్, సంజేవ్ అగర్వాల్ అనే ఏజెంట్లు భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా