By: Oneindia Telugu Video Team
Published : December 01, 2017, 01:33

ఇవాంక పర్యటన:అమెరికా సీక్రెట్ సర్వీసెస్ లేఖ

Subscribe to Oneindia Telugu

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు, సలహాదారు ఇవాంక హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు నిర్వహించిన పాత్రకు సర్వత్రా ప్రశంంసలు లభిస్తున్నాయి. సాంంకేతిక పరిజ్ఞానంలో విశేషమైన నైపుణ్యం గల తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిది అందులో కీలకమైన పాత్ర. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, ఇవాంక పర్యటనలో ఏ విధమైన భద్రతా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆయనకు అమెరికా సీక్రెట్ సర్వీసెస్ నుంచి కూడా ప్రశంసలు అందాయి.
తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్‌రెడ్డికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ కూడా రాసింది ఇవాంకా పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని ప్రశంసించింది. అర్ధరాత్రి వేళల్లో కూడా ఎంతో సహనంతో, విరామం లేకుండా తెలంగాణ పోలీసు అధికారులు అందించిన సేవల వల్లే ఇవాంకా పర్యటన విజయవంతమైందని అభిప్రాయపడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా