vastu tips - మీ పూజగదిలో ఇవి ఉన్నాయా? వెంటనే తొలగించండి
Published : November 03, 2022, 01:30
ఇంట్లో పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిపోయిన మతపరమైన పుస్తకాలు, పగిలిన ఫోటో ఫ్రేములు, పూర్వీకుల చిత్రాలు, విరిగిపోయిన అక్షంతలు, కోపం తో ఉన్న విగ్రహాలు ఉంటే అరిష్టం అని చెప్తున్నారు ఇక పూజ గదిలో ఉండకూడని మరొక వస్తువు అక్షంతలు గా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దేవతలకు నైవేద్యంగా కూడా నూకలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పెట్టకూడదు. ఇక అలాంటి బియ్యాన్ని పూజ గదిలో వినియోగిస్తే పూజ ఫలితం ఉండదు. కాబట్టి వాటిని తొలగించి వాటి స్థానంలో మంచి బియ్యాన్ని ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.