By : Oneindia Telugu Video Team
Published : October 31, 2017, 06:22

వేము నరేందర్‌ రెడ్డి గుండె కోతతో : ఆత్మీయుల మాట..ముచ్చట..

రేవంత్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రేవంత్‌‌తోపాటు కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరతారు.రేవంత్‌రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి కూడ హజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించేందుకు ఉత్తమ్ ఈ సమావేశానికి హజరయ్యారు. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక టిడిపి నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. వారిలో వేము నరేందర్‌ రెడ్డి కూడా ఉన్నారు. అయన కాసేపు తన మాటలను పంచుకున్నారు. రేవంత్‌తో పాటు టిడిపి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. రేవంత్‌రెడ్డి తాను టిడిపిని ఎందుకు వీడాల్సి వచ్చిందో ఈ సమావేశంలో ప్రకటించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఏ రకంగా ఉద్యమం చేసింది. తనకు అత్యంత ఇష్టమైన నేత చంద్రబాబునాయుడును వీడాల్సి ఎందుకు వచ్చిందో ఈ సమావేశంలో ప్రకటించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా