By: Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 09:49

అర్జున్ రెడ్డి పై వైసిపి ఫైర్ నా కథను పోర్న్ సినిమా చేశారు

Subscribe to Oneindia Telugu

అర్జున్ రెడ్డి సినిమా కథ తనది అని 'ఇక సె..లవ్' చిత్ర దర్శకులు నాగరాజు అన్నారు. లక్షణమైన తన అర్జున్ రెడ్డి కథను బూతు సినిమాలా తయారు చేసి విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇక సె..లవ్' ఫీచర్ ఫిల్మ్ నుంచి అర్జున్ రెడ్డి కథను దోచేశారన్నారు. అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో తాజాగా ఈ వివాదం మరింత ముదిరింది. ఆ సినిమా పోస్టర్ల చించివేతతో మొదలైన వివాదం ఇప్పుడు చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం వరకు వచ్చింది. ఇప్పుడు తన కథను కాపీ కొట్టి సినిమా తీశారని డైరెక్టర్ నాగరాజు ఖమ్మంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్జున్ రెడ్డి సినిమా కథ తనదే అని వాదిస్తున్నాడు. ఈ మేరకు మూవీ దర్శక నిర్మాతలకు నోటీసులు పంపాడు. తన కథతో తీసిన సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాక నష్టపరిహారంగా రూ.2కోట్లు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మహిళాసంఘాలు కూడా అర్జున్ రెడ్డి సినిమాను నిషేధించాలని పట్టుబడుతున్నాయి. ఈ సినిమాలో డ్రగ్స్, వల్గర్ సన్నివేశాలు యువతను చెడగొట్టేలా ఉన్నాయని మహిళా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా