By : Oneindia Telugu Video Team
Published : December 12, 2017, 11:17

తెలుగు హస్య నటుడు విజయ్ సాయి సెల్పీ వీడియోలో ఏముందంటే ?

తెలుగు సినీ హస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య.పై కుటుంబసభ్యులు, భార్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.అయితే విజయ్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే సెల్పీ వీడియో ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు చనిపోవడం కష్టంగా ఉంది, కానీ, తప్పడం లేదంటూ విజయ్ సాయి సెల్పీ వీడియోలో ప్రకటించడం అతడు పడిన మానసిక సంఘర్షణకు అద్దం పడుతోందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు
యూసుఫ్‌గూడలోని తన ఇంట్లోనే విజయ్ సాయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విజయ్ భార్య వనితా రెడ్డితో పాటు శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్‌లు తనను వేధించారని విజయ్ సాయి సెల్పీ వీడియోను రికార్డ్ చేసిన తర్వాత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే ఈ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. పోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక ఈ వీడియోపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.
చనిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పట్లేదని, తన కుమార్తెను వనితా రెడ్డి దగ్గర నుండి తీసుకురావాలని సెల్పీ వీడియోలో కోరినట్టు చెబుతున్నారు.నాలుగు నిమిషాల పాటు సెల్పీ వీడియోను విజయ్ రికార్డ్ చేశారు. అయితే ఈ వీడియోలో విజయ్‌ ధరించిన వస్త్రాలు, వీడియోలో ఉన్న వాటిని పోల్చిన పోలీసులు.. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే దాన్ని చిత్రీకరించినట్లు గుర్తించారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా