By : Oneindia Telugu Video Team
Published : August 31, 2017, 10:32

కాంగ్రెస్‌లో విజయశాంతి, అజహరుద్దీ‌న్‌కు కీలకపదవులు

2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతోంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం చర్యలను తీసుకొంటోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలోకి సెలబ్రిటీలను తీసుకొంది. సినీ నటి విజయశాంతి, ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ కు ఈ కమిటీలో చోటు దక్కింది. 2019 ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తోంది. పీసీసీని పునర్వవ్యవస్థీకరించే పనిలో ఎఐసిసి నాయకత్వం ఉంది.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ నాయకత్వం చర్యలను తీసుకొంటుంది. నవంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీలోని అన్ని రకాల కమిటీలను పూర్తిచేయాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. పిసీసీ అధ్యక్షుడికి తోడుగా మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more