By: Oneindia Telugu Video Team
Published : January 31, 2018, 12:48

బోండా ఉమ వెనుక చంద్రబాబు

Subscribe to Oneindia Telugu

వచ్చే ఎన్నికల్లో తెలుగదేశం పార్టీతో పొత్తు అంశంపై తేల్చాల్సింది ముగ్గురేనని రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మంగళవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులు మాత్రమే తేల్చాల్సిన విషయమన్నారు.
కామినేని ఈ వ్యాఖ్యల ద్వారా అటు టీడీపీకి, ఇటు సొంత పార్టీ నేతలకు కూడా షాకిచ్చారని చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు వద్దని కోరుకుంటున్న బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇటీవల బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలకు కూడా షాకిచ్చేలా కామినేని వ్యాఖ్యలు ఉన్నాయి. కామినేని ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేయగా ప్రజలు అయిదేళ్లు పాలించేందుకు అధికారం ఇచ్చారని చెప్పారు. ఈ లోపలే లేనిపోని వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని చెప్పారు.
ఇటీవల శ్రీధర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడిని అని చెప్పుకుంటూ టీవీల్లో చర్చా వేదికల్లో మాట్లాడారని, త్వరలో ఇద్దరు రాష్ట్ర మంత్రులను మార్చబోతున్నారని చెప్పారని, కానీ ఆ వ్యక్తి హోదా గురించి ఆరా తీస్తే పార్టీలో ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి అన్నారు. అలా స్థాయి మరిచి మాట్లాడకూడదనేది తమ సిద్ధాంతమని చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తోందని, పట్టిసీమ వల్ల రెండు జిల్లాల్లో రైతులు పంటలు పండించుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా