By : Oneindia Telugu Video Team
Published : August 03, 2017, 04:30

విక్రమ్ గౌడ్‌ అరెస్ట్ ఆస్పత్రి నుండి నేరుగా..

కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. తనకు తానుగానే పక్కా ప్రణాళికతో కాల్పులు జరుపుకున్నట్లు గుర్తించిన పోలీసులు విక్రమ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతోనే విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇలా చేస్తే సానుభూతి ఓట్లు సంపాదించవచ్చునని అతని ఆలోచన అని చెప్పారు. ఎన్నికల కోసమే హత్యాయత్నం నాటకం ఆడారన్నారు. తర్వాత శత్రువులు తనపై కాల్పులు జరిపారని కథ అల్లాడని తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా