By: Oneindia Telugu Video Team
Published : November 08, 2017, 06:21

తెలంగాణ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా "వైరల్" పాట

Subscribe to Oneindia Telugu


మెదక్ జిల్లాలో చేపడుతున్న మల్లన్న సాగర్ వ్యవహారం రాజకీయంగా హాట్ హాట్ గా మారింది. మల్లన్న సాగర్ నీటిపారుదల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 14 గ్రామాలకు చెందిన గ్రామస్థులు 515 రోజుల గా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐతే నిరసన 500 వ రోజు విడుదల చేసిన ఒక వైరల్ పాట ఇప్పుడు హల్చల్ చేస్తుంది, గ్రామస్తులు జరిపిన పోరాటం గురించి, గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను, క్షోబను వివరిస్తు, ప్రజలు నొప్పికి అలవాటుపడిపోయారు, ప్రభుత్వం తో పోరాడటానికి అవసరమైన మానసిక స్థితిలో లేరు అంటూ పోరాట స్ఫూర్తిని తిరిగి కల్పించడానికి బక్కి శ్రీనివాస్ అనే గాయకుడు ఈ పాటను వ్రాసి పాడాడు .
ఐతే "నేను కేసీఆర్ కి వ్యతిరేకంగా లేను, కానీ మేము ఖచ్చితంగా ద్రోహాన్ని అనుభూతి చెందుతున్నాం అని " అతను జతచేసాడు. 14 గ్రామాలకు చెందిన గ్రామస్థులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నా వారు మీడియా మరియు పౌర హక్కుల సంస్థలచే నిర్లక్ష్యం చేయబడ్డారు , ఇప్పటికి 515 రోజుల నుండి ఆకలి సమ్మెలో ఉన్నారు అని అతను తన పాటలో ఆవేదన వ్యక్తం చేసాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా