By: Oneindia Telugu Video Team
Published : July 31, 2017, 01:13

'పూల్‌లో ఉల్లాసంగా' కోహ్లీ సేన

Subscribe to Oneindia Telugu

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత కోహ్లీ సేన స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా లంకతో జరిగిన టెస్టులో విజయం సాధించడంతో సిరిస్‌లో 1-0తో టీమిండియా ముందంజలో నిలిచింది.
గాలే టెస్టు విజయం తర్వాత 'పూల్‌లో ఉల్లాసంగా' అని కామెంట్‌ చేస్తూ ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలసి ఉన్న ఫొటోను కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇక గాలే టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా 'కోహ్లీ, రాహుల్‌తో సరదా సమయం' అంటూ ట్వీట్‌ చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా