By: Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 06:04

కోహ్లీ vs మిథాలి ఇద్దరికి అదే తేడా ...

Subscribe to Oneindia Telugu

మొన్నీమధ్యనే ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజార్చుకుంది టీమిండియా. ఇప్పుడు వరల్డ్‌ కప్‌ని చేజార్చుకుంది టీమిండియా. ఛాంపియన్స్‌ ట్రోఫీని కోల్పోయిన టీమిండియా పురుషులదైతే, వరల్డ్‌ కప్‌ని చేజార్చుకున్నది మహిళల టీమిండియా. కోహ్లీ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీని కోల్పోతే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే, మిథాలీ సేన వరల్డ్‌ కప్‌ని కోల్పోతే ప్రశంసలు దక్కుతున్నాయి.! తేడా ఏంటి.? గెలవాల్సిన మ్యాచ్‌ని కోల్పోయినా మహిళా టీమిండియా భారత క్రికెట్‌ అభిమానుల మనసుల్ని గెల్చుకుంది. 191 పరుగులకి మూడు వికెట్లు.. టార్గెట్‌ జస్ట్‌ 229 పరుగులు మాత్రమే. అయినా, ఒత్తిడికి టీమిండియా తలొగ్గింది. ఫలితం వరల్డ్‌కప్‌ కిరీటం చేజారిపోయింది. అయితేనేం, కోట్లామంది భారతీయ క్రికెట్‌ అభిమానులు సాహోరే మిథాలీసేన.. అంటోంది. ఇదీ, మిథాలసేన సాధించిన ఘనవిజయం.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా