By: Oneindia Telugu Video Team
Published : October 25, 2017, 09:29

కోహ్లీ-అనుష్కల పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా ?

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు పెళ్లెప్పుడు చేసుకుంటారా? అని అటు క్రికెట్ అభిమానులు, ఇటు సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ డిసెంబరులో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు మంగళవారం జాతీయ మీడియాలో వచ్చాయి.
డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు గత కొన్నేళ్లుగా ప్రేములో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి.
వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబర్ నెలలో క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించమని కోహ్లీ బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే కోహ్లీ విశ్రాంతి అడిగాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించారు. ఈ యాడ్ నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా