By: Oneindia Telugu Video Team
Published : December 04, 2017, 04:31

కోహ్లీ 'డబుల్ సెంచరీ' : రికార్డ్స్ !

Subscribe to Oneindia Telugu

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డబుల్‌ సెంచరీ చేసిన కోహ్లీ... చివరిదైన మూడో టెస్టులో కూడా డబుల్ సెంచరీ సాధించాడు.ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా లంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్‌ సెంచరీని సాధించాడు. దీంతో వరుసగా రెండో డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
కోహ్లీకి టెస్టుల్లో ఇది ఆరో డబుల్ సెంచరీ కాగా... ఈ సిరిస్‌లో వరుసగా రెండోది. తద్వారా ఆరు డబుల్‌ సెంచరీలు సాధించిన భారత దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. అలాగే కెప్టెన్‌‌గా ఆరు డబుల్‌ సెంచరీలు చేసిన కోహ్లీ... వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్‌ లారా(5)ను అధిగమించాడు.
అంతేకాదు మూడు టెస్టుల సిరీస్‌ మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించిన తొలి అంతర్జాతీయ కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయగా, రెండో టెస్టులో 213 పరుగులు చేశాడు. మూడో టెస్టు లో 243 పరుగులు చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా