By: Oneindia Telugu Video Team
Published : November 01, 2017, 11:10

రోహిత్ శర్మ బ్యాటింగ్ ని నేను ఎంజాయ్ చేస్తాను !

Subscribe to Oneindia Telugu

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని, అతడు కొట్టే షాట్లను అవతలి ఎండ్ నుంచి చూసేందుకు ఇష్టపడతానని విరాట్ కోహ్లీ అన్నాడు. కాన్పూర్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 230 పరుగులు జోడించారు. సిరిస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించగా, చివరి ఓవర్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేయడంతో మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మలు పలు రికార్డును నమోదు చేశారు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో 200కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇది నాలుగోసారి. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరూ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా