By: Oneindia Telugu Video Team
Published : December 22, 2017, 12:10

కోహ్లీ అనుష్కల పెళ్లి విందు లో ప్రధాని ! వీడియో

Subscribe to Oneindia Telugu

రెండ్రోజులు ముందు ఢిల్లీ‌లోని తన స్వగృహానికి శ్రీమతిని తీసుకుని వచ్చిన విరాట్ రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ జంట ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇద్దరూ టాప్ సెలబ్రిటీలు, అందులో టీమిండియా కెప్టెన్ పిలిస్తే రాకుండా ఉంటారా.. వీలు చూసుకుని వేడుకకు వచ్చారు మోడీ .
రిసెప్షన్ వేడుకను హోటల్‌ తాజ్‌ ప్యాలస్‌లో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా చేసిన ఏర్పాట్లకు ప్రధానితో సహా బంధు మిత్రులు సైతం ఆశ్చర్యానికి గురైయ్యారు. వేడుకలో కోహ్లీ, అనుష్కలు సంప్రదాయ దుస్తుల్లో హాజరైయ్యారు. వారి వేషాధారణే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రిసెప్షన్ వేడుకను రెండు దఫాలుగా నిర్ధేశించిన విరాట్ డిసెంబరు 26న మరోసారి ముంబైలో జరపనున్నాడు. ఆ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెటర్లకు మరో విందు రానున్నారు. శ్రీలంకతో జరిగే చివరి టీ20 మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు.. ఈ విందులో పాల్గొంటారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా