• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 07, 2020, 05:30
    Duration : 02:25

    విశాఖపట్నంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న శుద్ధి కార్యక్రమాలు..!!

    విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువుల లీకేజీపై స్థానిక అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. విష వాయువులు విస్తరించిన ప్రాంతాలన్నింటినీ శుద్ధి చేస్తోంది. దీనికోసి హెలికాప్టర్‌ను రంగంలోకి దించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారుల నేతృత్వంలో ఈ పనులు కొనసాగుతున్నాయి.ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం సహా టైలర్స్ కాలనీ, ఇందిరానగర్, నాయుడుతోట, వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్డు, సింహాచలానికి వెళ్లే మార్గాలు, కొత్తపాలెం, భగత్‌సింగ్ నగర్, మాధవాపురం, సింహపురి కాలనీ, కృష్ణరాయపురం, పొర్లుపాలెం, సంతోష్ నగర్, కాకాని నగర్, సింహపురి కాలనీ.. వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా సముద్రపు నీటిని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో చల్లుతున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా