NCA హెడ్‌గా VVS లక్ష్మణ్... భారత క్రికెట్లో అనూహ్య పరిణామాలు
Published : November 14, 2021, 11:00
కోట్లాదిమంది ఆరాధించే.. ఓ మతంలా భావించే భారత క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి అవమానకరంగా భారత జట్టు వెనుదిరిగిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. టీమిండియాను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన చరిత్ర గల మాజీ క్రికెటర్లు కీలక పదవుల్లో నియమితులవుతున్నారు.