By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 08:28

ఫీజు రీయింబర్సుమెంట్స్‌పై వాగ్వాదం

Subscribe to Oneindia Telugu

కేసీఆర్‌ విద్యార్థులపై కక్ష గట్టారని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశల సందర్బంగా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పై ఆంక్షలు విధించారన్నారు. 2016-17లో ఒక్క పైసా విడుదల చేయలేదని తెలిపారు. టీడీపీ అభ్యర్ధి.. రేవంత్ రెడ్డి.. పాల్గొంటూ..రాష్ట్రంలో విద్యార్దులకు ఫీజు రీయంబర్స్‌ మెంట్ అమలు చేస్తారా? లేదా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దళిత, పేద విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించడంలేదని, వారు చదువుకోకూడదని ప్రభుత్వం భావిస్తుందా? అని ప్రశ్నించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా