By : Oneindia Telugu Video Team
Published : November 30, 2017, 10:25

యాసిడ్ దాడి : స్క్రూ డ్రైవర్‌తో కళ్లల్లో కూడా పొడిచారు

జిల్లాలో మరో యాసిడ్ దాడి ఘటన సంచలనం రేపుతోంది. భర్తతో విభేదాల కారణంగా.. తల్లితో కలిసి జీవిస్తోన్న ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి చేయడమే కాదు, ఆమె కళ్లను నిర్దాక్షిణ్యంగా స్క్రూడ్రైవర్ తో పొడిచేసినట్లు సమాచారం.ముఖం పూర్తిగా కాలిపోయి.. అత్యంత విషమ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పెళ్లి చేసుకోవాలని వేధిస్తోన్న ఆటో డ్రైవర్ చందు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వరంగల్‌ మట్టెవాడ ప్రాంతంలో నివాసముండే మాధురి(31) అలియాస్‌ మధుకు మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌ జిల్లా కు చెందిన చంటితో వివాహం జరిగింది. చంటి మాధురికి స్వయానా మేనమామ అని తెలుస్తోంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది.
బిడ్డ పుట్టిన తర్వాత మాధురి-చంటి వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకున్నాయి. అప్పటినుంచి భర్తకు దూరంగా వరంగల్‌ రాజరాజేశ్వరీదేవి ఆలయ సమీపంలోని తల్లిగారింట్లోనే మాధురి ఉంటోంది. జీవనోపాధి రీత్యా స్థానిక సాకరాసికుంట పెట్రోల్ బంకులో కొన్నాళ్లు పనిచేసింది.పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సమయంలోనే ఆటో డ్రైవర్ అయిన చందుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరుచూ అతను ఆమెతో మాట్లాడుతుండేవాడు. ఓరోజు చంటి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి మాధురితో గొడవ పడటంతో యాజమాన్యం ఆమెను పనిలో నుంచి తీసేసినట్లు చెబుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా