By: Oneindia Telugu Video Team
Published : December 31, 2017, 10:19

రాశి ఫలాలు ( 31-12-2017 నుండి 6-1-2018 )

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. 31-12-2017 వ తేదీ ఆదివారం నుండి 6-1-2018 శనివారం వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. పుష్య శుద్ధ త్రయోదశి మద్యాహ్నం 1 గంట 35 నిమిషముల వరకు వుంది. రోహిణి నక్షత్రం రాత్రి 4 గంటల 45 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు ఒత్తిడి తోనైనా పూర్తి చేస్తారు. పట్టుదలతో పూర్తి చేస్తారు. భార్య సహకారం తో లాభాలు చేకుర గలవు. ఇంటి పనులు శ్రద్ద గా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి విందు భోజనం లభిస్తుంది. పని వారి సహకారం కూడా వుంటుంది. సోదరుల సహకారం కుడా వుంటుంది. మిధున రాశి వారు అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి భందు మిత్రుల రాకపోకలుంటాయి. చేయు పనులు యందు ఆటంకాలు ఏర్పడే అవకాసం వుంది. సింహ రాశి వారు వృత్తి కొరకు అభివృద్ధి ప్రణాలికలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభించగలదు. కన్య రాశి వారికి దూరపు బంధు ప్రనలికలుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తుల రాశి వారు చేయు పనులు ఆలస్యాన్ని ఇవ్వడం తో చిరాకు వస్తుంది. అధిక కోపం తో కొన్ని పనులు చేజారే అవకాసం వుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ధనం కోసం ఆలోచన చేయవలసి వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసి వుంటుంది. కొన్ని కలహాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. మకర రాశి వారికి పిల్లలతో వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం.కుంబ రాశి వారికి తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. తండ్రి గారి అనుగ్రహం పొందవలసిన సమయం. అధికారుల మన్ననలు పొందుతారు. మీన రాశి వారు అనుకున్న పనులు ఆటంకాల తో వాయిదా పడతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా