By: Oneindia Telugu Video Team
Published : December 09, 2017, 05:55

రాశి ఫలాలు 10-12-2017 నుండి 16-12-2017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. 10-12-2017 వ తేదీ ఆదివారం నుండి 16-12-2017 శనివారం వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ సప్తమి ఉదయం 7 గంటల 21 నిమిషముల వరకు వుంది. తదుపరి అష్టమి రాత్రి తెల్లవారితే 5 గంటల 31 నిమిషము వరకు వుంది. పుబ్బ నక్షత్రం రాత్రి 10 గంటల 51 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు ఏ పనైనా పట్టుదలతో సాధించాలని చూస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారు మనసు ప్రశాంతం గా వుంటుంది. అనుకున్న పనులు వాటంతట అవే జరుగుతాయి. మిధున రాశి వారు చేయు పనులు ఆటంకాలు తో సాగుతాయి. శరీర శ్రమ వుంటుంది. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. కర్కాటక రాశి వారు చేయు ధన ప్రణాళికలు ఫలితం సాధిస్తాయి. శరీర శ్రమ వుంది. జాగ్రత్త అవసరం. సింహ రాశి వారు మనసులోని కోరికలు నెరవేరతాయి. వృత్తి వ్యాపారాలు బాగా వుంటాయి. సోదరుల సహచరుల సహకారం వుంటుంది. కన్య రాశి వారు చేయు ధన ప్రణాలికలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి. తుల రాశి వారు బంధు మిత్రుల కలయికలుంటాయి. అనుకూల దాంపత్యం కలదు. అనుకున్న పనులు ఆనందన్నిస్తాయి. వృశ్చిక రాశి వారు తలచిన కార్యక్రమాలు బాగా జరుగుతాయి. ధనం కోసం కష్టపడవలసి వుంటుంది. ధనూ రాశి వారు శరీర శ్రమ ఉండగలదు. చేయు పనులు ఆటంకాలు ఏర్పడతాయి. మకర రాశి వారికి కొత్త అవకాశాలు చేజారే అవకాశం వుంది. జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం. కుంబ రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి. మీన రాశి వారు అనుకున్న పనులు ఆటంకాల తో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా