By : Oneindia Telugu Video Team
Published : December 24, 2017, 11:32

వార ఫలాలు (24-12-2017 నుండి 30-12-2017)

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. 24-12-2017 వ తేదీ ఆదివారం నుండి 30-12-2017 శనివారం వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. పుష్య శుద్ధ షష్టి రాత్రి 8 గంటల 57 నిమిషముల వరకు వుంది. శతభిష నక్షత్రం రాత్రి 7 గంటల 51 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయికలు వుంటాయి. వృషభ రాశి వారు అనుకున్న పనులు ఆటంకాలు వుంటాయి. వాయిదా కూడా పడతాయి. పని వారి సహకారం వుంటుంది. మిధున రాశి వారు తలచిన పనులు మందకొడిగా సాగుతాయి. ధనానికి ఇబ్బందులు వుంటాయి. కర్కాటక రాశి వారు చేయు పనులు యందు ఆటంకాలు ఏర్పడే అవకాసం వుంది. చేతిలో వున్న అవకాశాలు చేజారి పోయే ప్రమాదం వుంది. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. సింహ రాశి వారు చేయు పనులు సులువుగా పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా వుంటాయి. సోదరుల సహచరుల సహకారం వుంటుంది. కన్య రాశి వారు అనుకున్న పనులు ఆనందంగా పూర్తి చేస్తారు. ధన సంబంధమైన ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి మీద భాద్యత వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి. తుల రాశి వారు అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. సోదరులుల్ మరియు అధికారుల సహకారం పూర్తిగా వుంటుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. ధన సంబంధ ప్రణాళికలు పట్టుదలగా పూర్తి చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. ధనూ రాశి వారు చేయు పనులు యందు శ్రద్ద అవసరం. ఆలస్యమయ్యే పనులు ఎక్కువగా వుంటాయి. కలిసొచ్చే పనులు చాలా తక్కువగా వుంటాయి. పనులు వాయిదా పడతాయి. మకర రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. ధన ప్రణాలికలు వేయవలసి వుంటుంది. వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం.కుంబ రాశి వారికి అనుకున్న లక్ష్యాలు సులువుగా నెరవేరతాయి. అధికారుల మన్ననలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి. మీన రాశి వారు అనుకున్న పనులు ఆటంకాల తో వాయిదా పడతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా