By : Oneindia Telugu Video Team
Published : January 23, 2018, 07:03

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమ్మాయిలతో ఎలా ఎంజాయ్ చేస్తాడంటే ?

ప్రపంచ దేశాల్లో దాదాపు అన్ని దేశాలు అమెరికాని చూసి భయం తో వణికిపోతూ ఉంటాయి. కాని అలాంటి అగ్రరాజ్యం అమెరికా కూడా ఒక దేశాన్ని దారిలోకి తెచ్చుకోలేక నానా తంటాలు పడుతుంది. ఆ దేశమే ఉత్తర కొరియా. అలా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచం మొత్తం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక అమెరికాను భయపించడంలోనే కాదు.. కిం జోంగ్ ఉన్ కు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరమే. ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు లోకానికి పెద్దగా తెలియవు. ఎప్పుడూ ఆయుధాలతో సహవాసం చేసే కిమ్‌ జీవితాన్ని ఒక్కసారి చూస్తే
కిమ్ చిన్నప్పుడు చాలా ఫన్నీ మనిషి. అందరితో సన్నిహితంగా ఉండేవాడు. కిమ్‌కు చిన్నప్పటి నుంచి ఓడిపోవడం అస్సలు నచ్చేది కాదు. చిన్నప్పటి కూడా తనకు ఏదనిపిస్తే అది చేసేవాడు. ఆడవారిని అస్సలు లెక్కచేసేవాడు కాదు.
కిమ్‌ జాంగ్ ఉన్ కుటుంబానికి ఉత్తరకొరియా మొత్తం మీద 17 ప్యాలెస్‌లు ఉన్నాయి. సొంతగా ఓ ఐలాండ్‌ కూడా ఉంది. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన, 200 అడుగులు పొడవు ఉండే పడవ కిమ్‌ సొంతం. సినిమాలు వీక్షించేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్‌ ఉంది. 100కు పైగా కార్లు రోజూ కిమ్‌ సైగ కోసం ఎదురు చూస్తుంటాయి. ఎలాంటి దాడి జరిగినా ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా కిమ్‌ కోసం ప్రత్యేకంగా మెర్సిడెజ్‌ కారును తయారు చేయించారు. లగ్జరీ వాచ్‌లు అంటే కిమ్‌ పడి చచ్చిపోతారట. ఎనిమిది మిలియన్‌ డాలర్ల విలువైన వాచ్‌లు కిమ్‌ వద్ద ఉన్నాయి.2011 డిసెంబర్‌ 17న తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ మరణంతో ఆయన తనకు తాను వారసుడిగా ప్రకటించుకున్నారు.కిమ్‌ జాంగ్‌ ధూమపానప్రియుడు. మద్యపాన ప్రియుడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more