By: Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 04:32

పట్టు తప్పుతున్న తెలుగు తమ్ముళ్లు..?

Subscribe to Oneindia Telugu

తెలుగు దేశంపార్టీలో ఏం జరుగుతుంది..? తెలుగు తమ్ముళ్లు పట్టు తప్పుతున్నారా..? టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఎవరికి వారు పక్కదారి పడుతున్నారు. పార్టీ అధిష్టానం చెప్పుచేతల్లో ఏ ఒక్కరూ ఉండటం లేదు. ఎవరి ఇష్టం వారిదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం టీడీపీలో వ్యతిరేకుల జాబితా పెరిగిందనే చెప్పాలి. జూనియర్లు సీనియర్లు అనే తేడా లేకుండా ఎవరికి వారు పట్టుతప్పుతున్నారు. ఇటీవల కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి వర్గీయులు... సీఎం రమేష్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ మనిషి అని తెలిసినా... తమ నాయకుడికి మంత్రి పదవి రాకుండా సీఎం రమేష్‌ అడ్డుపడ్డారనే ఆరోపణలతో వారంతా రెచ్చిపోయారు. దీంతో కాసేపు నానా రభసా జరిగింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా