By: Oneindia Telugu Video Team
Published : August 31, 2017, 04:52

వైసీపీ ఫ్యూచర్ స్ట్రాటజీ? మళ్లీ అదే తప్పా.. టీడీపీకి అది ప్లస్!

Subscribe to Oneindia Telugu

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మాత్రం భవిష్యత్తుపై దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. సర్దిపుచ్చుకోవడానికో.. సమర్థించుకోవడానికో మాత్రమే పరిమితమైపోతే చేజేతులా భవిష్యత్తునూ సందిగ్దంలోకి నెట్టుకున్నట్లే. ఏపీలో వైసీపీ పరిస్థితి ఇప్పుడిలాగే తయారైందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నంద్యాల ఓటమిపై ఆ పార్టీలో స్వీయ విశ్లేషణ జరిగిందా? అంటే కాదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అధికార పార్టీ ప్రలోభాలే టీడీపీని గెలిపించాయే తప్ప.. తమలో ఎలాంటి లోపం లేదనే రీతిలో ఆ పార్టీ ముందుకు వెళ్తుండటం మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా