By : Oneindia Telugu Video Team
Published : January 09, 2018, 11:07

అసలు ఎవరీ మహేష్ కత్తి?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తెరిపి లేకుండా విమర్శలు చేస్తూ మహేష్ కత్తి వార్తల్లో వ్యక్తిగా మారారు. సినీ క్రిటిక్‌గా మాత్రమే ఆయన చాలా మందికి తెలుసు. సినిమాలను తన సమీక్షల ద్వారా కత్తి తీసుకుని నరుకుతాడని అందరూ అనుకుంటూ వస్తున్నారు. తాను అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నానని మహేష్ కత్తి చెబుతున్నప్పటికీ ఆయన ప్రధాన లక్ష్యం పవన్ కల్యాణ్ అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. పవన్ కల్యాణ్‌నే ఎందుకు లక్ష్యం చేసుకున్నాడనే విషయంపై ఎవరి అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే, కత్తి మహేష్ జీవితం ఏమిటనేది చాలా మందికి తెలియని విషయం.
మహేష్ కత్తి చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడంతో ఆయన పేరు చాలా వరకు వెలుగులోకి వచ్చింది. ప్రచారం కోసమే ఆయన పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నప్పటికీ పూనమ్ కౌర్‌ను కూడా లాగడంతో అది సీరియస్‌గా మారిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్ ద్వారా మహేష్ కత్తి పేరు కొంత పాపులర్ అయింది. మహేష్ కత్తి సినిమా రివ్యూల గురించి బిగ్ బాస్ కార్యక్రమంలో ఎన్టీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఆయన చేసిన చికెన్‌కు కత్తి చికెన్ అని పేరు పెడుతున్నట్లు ఎన్టీఆర్ అన్నారు కూడా.ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మహేష్ కత్తి జన్మించాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ థియరీలో స్పెషలైజేషన్ చేశాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జీవితం ఆధారంగా వచ్చిన ఎదరి వర్షం లఘు చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా