By: Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 12:01

గుజరాత్ సిఎం రేసులో ఉన్న పలువురు వీరే !

Subscribe to Oneindia Telugu

గుజరాత్‌లో బిజెపి కనాకష్టంగా విజయం సాధించిందనే చెప్పాలి. ఆ విజయం కూడా ప్రధాని నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైందే గానీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వల్ల కాదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థితిలో విజయ్ రూపానికి మరోసారి ముఖ్యమంత్రి పదవి అప్పగించే విషయంపై బిజెపి అగ్రనాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు చర్చలోకి వస్తున్నాయి. అందులో స్మృతి ఇరానీ పేరు కూడా ఉంది.నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత గుజరాత్‌లో అంతటి ప్రజాకర్షక నేత లేకపోవడం బిజెపికి కొరతగా ఉంది. విజయ్ రూపానీ అంచనాలను అందుకోలేకపోయారనే అభిప్రాయం కూడా ఉది. ఈ స్థితిలో ప్రజాకర్షక నేతను ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాబోయే గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెలో నాయకత్వ లక్షణాలు దండిగానూ, గుజరాతీలో ధారాళంగా మాట్లాడగలిగే నేర్పు ఆమెకు ఉన్నాయి. ఆమెను ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రంలో తమ పార్టీ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం బిజెపి వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాను రేసులో లేనని స్మృతి ఇరానీ అంటున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించారు. సోమవారం ఎన్నికల ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తమకు చాలా సంతోషం కలిగించే విషయమని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా