By : Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 06:46

రైతుల ఆవేదన తీరనుందా...? ఇదంతా జగన్ దీక్షా ఫలితమేనా..?

ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతుకు నిత్యం కష్టాలే. ప్రకృతి ఎప్పుడు ప్రకోపిస్తుందో తెలీదు... పంట దిగుబడి మెండుగా ఉన్నా... గిట్టు బాటు ధర వస్తుందో రాదో తెలీదు. ఏ సీజన్‌కు ఆ సీజన్‌ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తుంటారు. కానీ అవి రెట్టింపవుతుంటాయి. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే తీరు కనిపిస్తుంది. ఒకపక్క మిర్చి రైతులు, మరోపక్క వరి రైతులు, పండిన పంటను అమ్ముకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇంతలో కురిసిన అకాల వర్షం పండిన పంటను మార్కెట్‌ యార్డ్‌ సాక్షిగా నాశనం చేసింది. దీంతో ఒక్కసారి అన్నదాత కుప్పకూలిపోయాడు. నాలుగు మెతుకులు గొంతులోకి దిగి.. కడుపు నిండుతుందనుకున్న సమయానికి... నోటికాడ కూడు గద్ద తన్నుకుపోయిన చందంగా తయారైంది అన్నదాత పరిస్థితి. అయితే కేంద్రం అన్నదాత ఆవేదనను అర్థం చేసుకుంది. మిర్చిరైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా