• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 06, 2018, 03:17
    Duration : 04:17

    అక్రమ సంబంధాలు : భర్తలను చంపిన భార్యల లిస్ట్ !


    భర్తలను చంపిన భార్యల ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో మహిళను నిందితురాలిగా చేయవచ్చునా అనే విషయంపై సుప్రీంకోర్టు పరిశీలించడానికి సిద్ధపడడం యాధృచ్ఛికమే కావచ్చు. కానీ ప్రియుల మోజులో పడి భర్తలను భార్యలు మట్టుబెడుతున్న వైనం ఆందోళనకరంగానే ఉంది. ఆవేశంలోనో, ఉద్రేకంలో జరుగుతున్న హత్యలు కూడా కావు. ప్రియులను, వారి స్నేహితులను సాయంగా తీసుకుని భార్యలు పక్కా పథకం ప్రకారం హత్య చేస్తున్నారు.
    గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం పాతులూరుకు చెందిన శ్రీవిద్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపింది. ఈ ఘటనలో నిందితుడు గొట్టిపాటి వీరయ్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బావతో కలిసి భర్తకు మద్యంలో విషం కలిపి ఇచ్చి భార్య చంపింది.
    తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. కొండమల్లెపల్లి మండలం ఏపూరు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమె భర్తను చంపేసింది. భర్త సోమాను హత్య చేసిన ఉదంతంలో పోలీసులు భార్య భారతిని అరెస్టు చేశారు. వరుసకు బావ అయ్యే రమావత్‌ శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. డిసెంబర్‌ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుంది. భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య చేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా